Friday, September 26, 2014

అమానవీయ మ్రుగం
        
              ఢిల్లీ లోని ఓ జూలో 21 ఏళ్ల మఖ్సూద్ అనే  యువకుడిని  తెల్ల పులి పొట్టన బెట్టుకుందన్న సంగతి జగద్విదితం. ఆ సంఘటన పై భిన్న కథనాలు ప్రసారమయ్యాయి. ఆ యువకుడి మతి సరైన రీతిలో లేనందున తానే పులి ఉన్న ప్రదేశానికి దూకాడనీ లేదా పులిని ఫోటో తీస్తూ పట్టు తప్పి పడిపోయాడనీ  కథనాలు ప్రసారమయ్యాయి. ఏదేమైనా ఎలా పడ్డాడో ఎందుకు పడ్డాడో సరిగ్గా తెలియకపోయినా పడ్డాక మాత్రం బిక్కు బిక్కు మంటూ పులి ముందు కూర్చున్న ఈ ఫోటో మాత్రం అన్ని పత్రికలూ ప్రధానంగా ప్రచురించాయి. 

సహజంగానే ఆ అసహజ మరణం తీవ్రమైన వేదన కలిగించింది. పత్రికల ద్వారానూ, కొద్ది మంది(ఫేస్ బుక్) ద్వారా తెలిసిన విషయమేమిటంటే ఆ యువకుడు పడిన వెంటనే పులి అతననిపై దాడిచేయలేదనీ అతను పడిన తర్వాత పులికి  ఏం జరిగిందన్న విషయం అర్థం కాలేదనీ, అది కూడా భయపడి ఈతడు తననేమన్నా చేస్తాడనే ఆపదతో ఓ పది నిమిషాలు చూస్తూ ఉందిట. ఇంతలో కొద్ది మంది ఆ పులిపై రాళ్లు, బాటిళ్లతో దాడి చేసి దానిని రెచ్చగొట్టడం వలన అది ఈతడిపై దాడి చేసి చంపివేసిందని. ముఖ్యంగా ఈ వార్త తెలిసాక మనసు మనసులో లేదు. ఏదో విషాద మేఘం నన్నావరించింది. మానవుల్లో పేరుకొన్న అమానవీయత్వాన్ని చూసి సాటి మానవుడిగా సిగ్గుతో తలదించుకున్నాను. జంతువు విషయం పెద్దగా చర్చించనక్కరలేదు. అది జంతువు మరీ ముఖ్యంగా మ్రుగం తనకు హాని జరుగుతుందని తెలిస్తే వెంటనే ఎదుటివారు వ్యక్తా, జంతువా, ఆడా, మగా అని ఆలోచించకుండా ఎదురుదాడి చేస్తుంది.  అయితే మనిషి అలా ప్రవర్తించడు ఆతడికి ఆలోచనా శక్తి ఉంది. ఆ శక్తితో మంచేదో చెడేదో, నీతేదో అవినీతి ఏదో నైతికత ఏదో అనైతికత ఏదో తెలసుకోగలడు. అయితే ఆ ఆలోచనా శక్తి మందగిస్తే ఖచ్చితంగా మానవుడు మ్రగుం అవుతాడు. ఇప్పటికి ఎన్నో సార్లు అలా అయ్యాడు. ముందు ముందు అవుతాడు కూడా. కనుమరగయి కరిగిపోయిన చరిత్రనొకసారి పరికిస్తే ఇలాంటి వందల సంఘటనలు బానిస వ్యవస్థలో ప్రస్ఫుటమవుతాయి. బానిసలు- యజమానులుగా మానవులు విడిపోయిన ఆ తరుణంలో బానిస యజమానులు బానిసలకు పులులకు మధ్య పోటీలు నిర్వహిస్తూ వారి ప్రాణాలు పోతుంటే  కేరింతలు కొడుతూ ఆనందడోలికల్లో తేలియాడిపోయేవారు. మనుష్యలను వస్తువులుగా పరిగణించే ఆ కాలంలో అది సరైందా కాదా అన్నవిషయం పక్కన పెడితే, ఈ కాలంలో ఎంత మాత్రమూ సరైంది కాదు. ఈ సంఘటనలో మానసిక వ్యాథిగ్రస్థుడు ఆ మనిషా లేదా పులిని అతనిపై దాడిచేసేలా ప్రేరేపించన వారా అనేది అర్థం కాకుండా ఉంది. ఎందుకు కొద్ది మంది ఇలా తయారవుతున్నారు. సాటి వ్యక్తిని కాపాడటానికి ప్రయత్నం చేయడానికి  బదులు అతను పడే బాధను ఎంజాయ్ చెయ్యాలని కోరుకునేదే మనస్తత్వం? మనం మళ్లా అటువంటి(బానిస) రాక్షస వ్యవస్థను కోరుకుంటున్నామా? అలా మనల్ని తయారుచేస్తున్నదేమిటి? అనే ప్రశ్నలు సశేషం. ఏదేమైనా మనిషిలో పెరుగుతున్న అమానవీయ మ్రుగానికి ఆహారం ఇవ్వకుండా మాడ్చి చంపాలని అది చావాలని నిజమైన మనిషిగా మనిషి జీవించాలని ఓ మనిషిగా కోరుకుంటున్నాను.

ఇంకా.....అంతే 

No comments:

Post a Comment