Saturday, June 21, 2014

టెంపోయాణం

టెంపోయాణం

రామాయణంలా టెంపోయాణం ఏంటని ఆశ్చర్యం కదా? ఇది సైన్మా బాష. సినిమాలు పలు రకములు అవి క్లాసిక్స్ కావచ్చును, హీరో బేస్డ్ కావొచ్చును, సంగీతంతో వాయించెడి వస్తువు కావొచ్చును, సెంటిమెంట్ తో పిండే వస్తువు కావచ్చును  ఇలా చెప్పుకూంటూ పోతే నానారకములు. ప్రస్తుతం మనం మాట్లాడేది పదో రసం గురించి. ఇదెప్పుడ ఉనికోకి వచ్చిందనుకుంటున్నారా. నేనే రప్పించా. నవరసాల గురించి తిరిగి మరలా చెప్పదలచుకోలేదు. ఇక్కడ పదో రసమైన టెంపో రసాన్ని కొద్దిగా ఒలికిద్దామనుకుంటున్నా. అసలు టెంపో అంటే నా దృష్టిలో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తిలకించేలా చేసే రసం.  ఆ రసాన్ని చాలా మంది దర్శకులు వాడుకొని మాంచి హిట్లు కూడా కొట్టారు.
        కేవలం ఫైట్లతోనే సినిమా తీస్తే అది యాక్షన్ సినిమా, సెంటిమెంట్ తో తీస్తే ఏడుపుగొట్టు సినిమా, కామెడీ పెడితే కామెడీ సినిమా మరి టెంపో సినిమా అంటే ఏంటి చెప్మా.  ఈ అంశాలన్నీ కలుపుకొని ఆసక్తికరంగా తీస్తే అదే టెంపో సినిమా. నాకు బేసిక్ గా చిన్నప్పటినుండి సినిమా పిచ్చి ఉండేది. ఆ మాంచి కారణం చేత అనేకానేక సినమాలు చూడడం మొదలుపెట్టాను.  యవ్వనంలో అందరిలానే యాక్షన్ సినిమాలు ఇష్టపడేవాడ్ని. ఇంకొంచెం పెరిగి పెద్దయ్యాక కొంత రియాల్టీకి దగ్గరగా ఉండే సినమాలు తర్వాత క్లాసిక్స్,  తర్వాత టెంపో సినిమాలు చూశాను. రొటీన్ యాక్షన్ మూవీస్లో కొత్తదనం లేకపోవడం వలన, క్లాసిక్స్ ఎక్కువగా చూడలేకపోవడం వలననో మనసు వేరే ఏదో వెతకడం మొదలుపెట్టింది. అప్పుడ అర్థం కాలా అది టెంపో కోసం పరిగెడుతోందని. ఇక ఆ ఆసక్తితో టెంపో సినిమాల కోసం మన గూగుల్ శోధనలో చాలా కాలం శోధించి కొన్ని సినిమాలు చూశా. వాటిలో కొన్ని వాంటేజ్ పాయింట్, ద డే ఆప్టర్ టుమారో, ద కోర్, వెడ్నెస్ డే, ద వైట్ హౌస్  డౌన్, బ్లడ్ డైమండ్, తదిత


రాలు.  ఈ సినిమాలన్నీ ఆల్మోస్ట్ యాక్షన్ సినిమాలను తలపిస్తాయి కానీ కావు. కేవలం కథనం మీద ఆధారపడినవి. పైగా ఇవన్నీ హిట్ సినిమాలే అంటే ప్రేక్షకులకు కావలసిన రసం ఇందులో ఉంది.  ఈ సినిమాలకు పెద్దగా కథమీ ఉండదు. ఉదాహరణకు ద వెడ్నెస్డేను చూస్తే పెద్దగా కథేమీ కనిపించదు. కేవలం రెండూ లేదా మూడు పాత్రలపై నడుస్తుంది. అయినా ఆద్యంతం మనోరంజకంగా తీశాడు దర్శకుడు. అలాగే మిగతావన్నీ కూడా మరొక విషయమేమిటంటే ఇవన్నీ నాకు నచ్చినవి నాకర్ధమైన రీతిలో చెపుతున్నాను. అందులో కరెక్టు ఉండొచ్చు లేదా లేకపోవచ్చు. మరొక సినిమా రీసెంట్ గా చూసింది దవైట్ హౌస్ డౌన్ అదొక ఆంగ్ల మూవీ. అందులో ఏమీ కథుండదు. అమెరికా అధ్యక్షుడిని వైట్ హౌస్లో బందించి తనకు కావాల్సిన పనులు చేయించుకోవాలని ఒక టెర్రరిస్టు గ్రూపు ప్రయత్నిస్తుంది. వారి బారి నుండి కాపాడటమే హీరో పని. సినిమా మొత్తం ఒకే చోట ఒకే అంశంపై నడుస్తుంది. అయినా ఎక్కడా బోర్ కొట్టదు. అలా కథనం చేసాడు దర్శకుడు. కాబట్టి టెంపో రసాన్ని బాగా పిండగలిగినవాడే ఈ టెంపో సినిమాలు తీయగలడు.