Tuesday, June 23, 2015

విశ్వరూపం

  సండే రోజు పనులకి ఎలాగూ సెలవు కాబట్టి స్నానం గీనం ఏమీ చేయకుండా పేపరొకటి ముందేసుకుని చదువుతూ, పక్కనోళ్లతో పిచ్చా పాటీ మాట్టాడుకుంటూ ఉండగా, మాకు తెలిసిన అన్న ఒకాయన వచ్చి బయటకి వెళ్దామా అని ప్రపోజ్ చేశాడు. ఎక్కడికీ, ఏమిటీ అని ఎంక్వైరీ చేస్తే హెచ్ బిటి (హైదరాబాద్ బుక్ ట్రస్ట్) వారు పుస్తక ప్రదర్శననొకటి ఏర్పాటు చేశారనీ, మంచి మంచి పుస్తకాలు దొరుకుతాయనీ అన్నాడు. బద్ధకంగా ఉన్న నాకు పుస్తకాలనగానే కొంచెం ఉత్సాహం కలిగి రెడీ కావడానికి వెళ్లాను(అంత మాత్రాన నేనో పెద్ద పుస్తకాల పురుగునేమీ కాదుగానీ, ఓ మోస్తరుగా చదువుతుంటానంతే). వివిధ రకాల కంపెనీల బైక్లపై పుస్తక ప్రదర్శన శాలకి బయలుదేరి వెళ్లాం.

          ప్రదర్శనలో కొన్ని పుస్తకాలు కొన్నప్పటికీ వాటిలో ఒక పుస్తకం నండూరి రామ్మోహన్ రావు అనే ఆయన రచించిన పుస్తకం ’విశ్వరూపం‘ నాకు బాగా నచ్చింది. (కమల్ హాసన్ తీసిన విశ్వరూపం స్ర్కీన్ ప్లే కాదులెండి). సైన్స్లోని వివిధ అంశాలపై ఆయన 1970ల్లో ఆంధ్రజ్యోతి పత్రికకి రచించిన వ్యాసాలని కొన్ని మార్పులు, అదనాలు చేకూర్చి తిరిగి 2011లో ముద్రణ వేశారు. చూసిన వెంటనే నాకాపుస్తకం నచ్చేసింది. చిన్నప్పటి నుండీ సైన్స్ మొత్తాన్ని తెలుసుకోవాలనే కోరిక ఉండేది. వెంటనే సైన్స్ మొత్తాన్ని తెలుసేసుకోవాలనే ఉబలాటంతో  బుక్కు చదవడం ప్రారంభించా. (ఇక్కడొక చిన్న నేపథ్యం. నాకు  అనేక రంగాల విషయాలను వెంటవెంటనే తెలిసేసుకోవాలనే కుతుహలం ఎక్కువ. అయితే అలా హడావుడిగా ప్రపంచాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదని స్పష్టమయ్యింది. ఏ పుస్తకం తెరిచానా కొంత చదవడం, మూసేయడం మరలా ఆ పుస్తకాన్ని తెరవకపోవడం పరిపాటయిపోయింది)
          అయితే ఈ పుస్తకాన్ని ఎలాగైనా పూర్తిగా చదవాలని కంకణం కట్టుకొని చదువుతున్నా. పుస్తకాన్ని ఎలాగొలా చదవడమొక్కటే లక్ష్యంగా ఉండకూడదు, అందులోని మేటర్ మన మేటర్ లోకి (బ్రెయిన్) ఎంత వెళ్లిందో చూడాలన్నాడు మరో సహోదరుడు. సో అలాగే చదవాలని ఫిక్సయ్యా. నేను ఎంత తెలుసుకున్నానే నాకు నేనే టెస్ట్ పెట్టుకుందామని ఈ పోస్ట్ రాస్తున్నాను. (అందరూ ఆశీర్వదించండి, ప్రోత్సహించండి, తప్పులను సరిదిద్దండి).

ధన్యవాదాలు

No comments:

Post a Comment