Thursday, July 10, 2014

కుక్కల మనుషులు


      శనివారం.....తేదీ సరిగ్గా గుర్తులేదు......సమయం బహుశా ఉ 11గంటలు.....హిమాయత్నగర్లోని ఓ చిన్న గల్లీ......హెరెత్తే పార్టీ ప్రచార నినాదాల మధ్య నాపాత ఫోన్లో నోకియా రింగ్ టోన్ నిండుగా మోగుతోంది......ఫోన్ లిఫ్ట్ చేశా.........కాలర్ మా మదర్..........సంభాషణ ఇలా సాగింది.
అమ్మా: ఏరా?
నేను: ఊ
అమ్మ: ఏం చేస్తున్నావు?
నేను: పన్లో ఉన్నాను
అమ్మ: ఎక్కడున్నావు?
నేను: బైట ఉన్నాను
అమ్మ: తిన్నావా?
నేను: తిన్నాను
అమ్మ: ఎండలో తిరుగుతున్నావా?...
నేను: అవును
అమ్మ: ఒరే నా ఫోనులో బాలెన్సు లేదు గానీ నువ్వు చేయరా మాట్లాడాలి
నేను: సరే
అని పెట్టేశాను.
అప్పటికి నా ఫోన్లో కూడా బాలెన్సు లేకపోవడమో లేదా మర్చిపోవడమో తెలియదుగానీ ఫోన్ చేయలేదు. తిరిగి మామూలుగా సోమవారం అమ్మతో మాట్లాడదామని ఫోన్ చేశా, అప్పుడు మా మదర్ కొన్ని శ్లోకాల్లా తిట్లు వల్లించి ఆనక అసలు విషయం చెప్పింది.

        గుడివాడలోని మా అద్దె గుమ్మం వద్ద ఒక పిచ్చి కుక్క పిచ్చిగా నిద్రపోతున్నదట. దాన్ని నిద్రాభంగం చేసి పారద్రోలటానికి మా మదర్ ఓ మాంచి రాయిని తీసి విసిరి కొట్టిందట, అది తగిలిన వెంటనే అది కుయ్యో మర్రో అనుకుంటూ పరుగులంకించిందట. కుక్క వెళ్లిపోయిందని ఇక మా అమ్మ ఇతర పనులు చేసుకుందామనుకుని వెళ్తుంటే ఒక మాంచి సిలిండర్ సైజ్లో ఉన్నవాడొకడు వచ్చి మా అమ్మతో కుక్క విషయమై కొట్లాటకు దిగాడట, కుక్కలను రాళ్లతో కొట్టరాదట, అది కరిస్తే కరిపించుకోవాలట ఇవీ వాడి లాజిక్ లు. ఇక్కడొక చిన్న ఫ్లాష్ బ్యాక్ మేముంటున్న ఇంటి వెనుక సందులో కొన్ని ఇళ్లు ఉన్నాయి. వాటిలో ఒక ఫ్యామిలీ ఉంది. భర్త, భార్య, వారి అన్నదమ్ములు వారి పిల్లలు ,వాళ్ల కుక్కలు మొదలయిన వారు అక్కడ ఆవాసముంటున్నారు. వారి వ్రుత్తి బంగారం కరిగించడం. ప్రవ్రుత్తి కుక్కల్ని పెంచడం. బహుశా తరతరాలుగా కుక్కల్ని పెంచడం వల్లనేమో తెలియదు గాని వారికి మనుషులకు కుక్కలకు ఆట్టే తేడా తెలియదు అంటే కుక్కలిన కూడా ఇంట్లో సభ్యుల్లా చూసిచస్తారట చోద్యం. కావున అలాంటి పెంపకంలో పెరిగిన మన సిలిండరు బాబు కుక్కన రాయితో తరిమివేయుట అనే కార్యక్రమాన్ని చూసి, హ్రుదయం ద్రవించి, ఆ కుక్క పై జాలితో, మా అమ్మపై కసితో కొట్లాటకు దిగాడట. కుక్కల పాలిట కరుణామయులైన అతని కుటుంబ సభ్యులు కూడా అతనికి వంత పాడారట. ఇక మా అమ్మ చుట్టుపక్కల వాళ్లను పోగేసి ఎదురుదాడి చేసేసరికి ఏమనుకున్నారో ఏమో తెలియదు గానీ ఆ ’’కుక్కల మనుషులు‘‘ తిరిగి వెళ్లిపోయారట. ఇదీ క్లుప్తంగా మా అమ్మ చెప్పిన కుక్క కథ.
        సరే అని చెప్పి మా అమ్మను సముదాయించి ఫోన్ పెట్టేసి  ఆ విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టా. అసలు రాయితో కుక్కని కొడితే వాడికంత కోపమెందుకొచ్చింది? పైగా వాడు ఆ కుక్క ఓనర్ కూడా కాడు కాదా? కుక్కల విషయమై పోట్లాడేముందు నేను మా పెద్దమ్మ వయస్కురాలైన ఒకావిడతో గొడవపడుతున్నాననే సంగతి కూడా మర్చిపోయాడే. కుక్కలపై ఎంత ప్రేమ, కుక్కలను ఉద్ధరించడానికి పుట్టిన పుణ్యపురుషుడా ఈయన ఆహా ఏమి ఆ కుక్క భాగ్యం ఈయన ప్రేమను చూరగొన్నాడే. అసలు కుక్కలకు మనుషులు అవసరమా లేదా మనుషులకే కుక్కలు అవసరమా ఇలా అనేక ప్రశ్నలు నా మనసులో ఉద్భవించాయి.
        ఎందుకో తెలియదు గానీ నాకు చిన్నపటినుండీ కుక్కలంటే ఏవగింపు ఎక్కువే. ఏ టైంలో ఏం జరిగిందో సరిగా తెలియదు గానీ కుక్కలపై సదాభిప్రాయం కలిగే ఏ సంఘటనా నాకు చోటు చేసుకోలేదు.  ఆ ఏవగింపు కాస్తా కుక్కల పెంపుడుగాళ్లపైన కూడా పడింది. ఫైనల్గా నేనే తేల్చేసిన విషయమేమిటంటే కుక్కల్ని పెంచేవాళ్లు మనుషులను చులకనగా చూస్తారు. ఇది కరెక్టో కాదో తెలియదు గానీ నాకు ఎదురైన సంఘటనలు ఇది నిజమనే నిరూపించినాయి. ఇంటి బైట ఒక భిక్షగాడు ఆకలితో ఆర్తనాదం చేస్తూ అడుక్కుంటుంటే కుక్క కన్నా హీనంగా అతన్ని భావించి గెంటేసి ఇంట్లోకి వచ్చి పెంపుడు కుక్కను ముద్దాడుతూ నోట్లో ముద్దలు కుక్కటం అనేక సార్లు చూశా. అప్పడు నేననుకునేది వీళ్లు మనుషులేనా లేదా కుక్కల జాతిలో వీరు కూడా కలసిపోయారా అని. మరొకసారి ఇంటికెళ్తున్న మా బాబాయిపై పిచ్చి కుక్కల మంద దాడి చేసి అనేక గాయాలు చేసాయి. ఒక సంవత్సరం క్రితం ఓ పిచ్చి కుక్క మా అమ్మపై దాడి చేసి విపరీతంగా గాయాలు చేసింది. ఆ గాయలు నయమవడానికి ఆరు నెలలు పట్టింది. బహుశా అది పునరావ్రుతం కాకూడదనేమో ఆ పిచ్చి కుక్కను పంపడానికి రాయితో కొట్టింది. ఇన్ని సంఘటనలకు ప్రభావితుడైన నేను కుక్కలు మానవులకు ఎందుకూ పనికిరావనీ, వాటిని పెంచుకుంటే వాటి లక్షణాలు కొన్ని వీరికి ట్రాన్స్ ఫర్ అవుతాయని భావించడం మొదలుపెట్టా. 

        క్షమించండి పైన పేరాగ్రాఫ్లో కొన్ని గుండెల్ని పిండే సంఘటనలు తెలియపర్చవలసి వచ్చింది. బహుశా నేననుకునేది మనుషులు కుక్కల్లో ఉండే ఏదో గుణాన్ని కనిపెట్టి అది మనకు ఉపయోగపడుతుందని భావించి దాన్ని మచ్చిక చేసుకొని ఉంటాడు. అది కాస్తా పెంచడం స్థాయికి దారితీసి ఇటువంటి విపరీతమైన మనుషులుగా మారుతున్నారనిపిస్తోంది(పైన తెలిపిన కుక్కలు మనుషుల). 


ఇవాన్ పావ్లోవ్ కొన్ని రోజుల పాటు కష్టపడి జంతువులకు ఆలోచించే గుణం లేదనీ కేవలం ఇన్ స్టింక్ట్స్తో జీవిస్తయాని తేల్చిపారేశాడు. అంటే ఒక్కోసారి పిచ్చెక్కితే ఆ కుక్క దాని ఓనర్నే కరవవచ్చు. ఎందుకంటే దానికి తన పర భేదం ఉండదు. అసలు సమస్య కుక్కల గురించి కాదు. అటువంటి కుక్కల మనుషుల గురించి, ఒక పెద్దావిడతో దురుసుగా మాట్లాడుతున్న పిల్లవానికి అతని తల్లి దండ్రులు బుద్దిచెప్పక వంత పాడడానన్ని ఏం తెలియజేస్తుందో నాకు అర్థం కావడం లేదు. కుక్కల సంరక్షణకై అహర్నిశలు పాటుపడుతున్న వీరికి మనుషుల బాధలు, పరిస్థితులు ఏం తెలుస్తాయిలే. పాపం వీరు వారి తరంతో పాటు వచ్చే తరానికి కూడా కుక్కల్ని వారసులుగా ఇచ్చి ఆ జాతిని ఉద్ధరిస్తున్నారు. ఎప్పుడు మారతారో ఈ కుక్కల మనుషులు.

1 comment:

  1. ఉప్పుకప్పురంబు నొక్కపోలిక నుండు
    చూడ చూడ రుచుల జాడ వేరు
    మనుషులందు కుక్కలమనుషులు వేరయా
    అల్షేసన్ మామ డాబర్‘మ్యానే’ కదరా రామా!!

    ReplyDelete